అందరి సహకారంతో అభివృద్ధి చేద్దాం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:22 PM
అందరి సహ కారంతో పట్టణాన్ని అన్ని వి ధాలా అభివృద్ధి చేద్దామని ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : అందరి సహ కారంతో పట్టణాన్ని అన్ని వి ధాలా అభివృద్ధి చేద్దామని ఎ మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు. మంగళవారం పట్టణంలో ని మునిసిపాలిటిలో మునిసి పల్ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌లో పా ల్గొని మాట్లాడారు. అంతకుముందు కౌన్సిలర్లు పట్టణంలోని తమతమ కాలనీలలోని సమస్యల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ కాలనీలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధాన సమస్యల పరి ష్కారం కోసం కృషి చేస్తామన్నారు. త్వరలో కా లనీలలో పర్యటించి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మురళి, వైస్ చైర్మన్ శైలజ, కౌన్సిల ర్లు సునిత, రమేష్ రావు, అంతటి శివ, సోమ్లా, తదితరులు పాల్గొన్నారు.