Share News

గద్దర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:39 PM

గద్దర్‌ ఆశ యాలను కొనసాగిద్దామని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నా రాయణరెడ్డి అన్నారు.

గద్దర్‌ ఆశయాలను కొనసాగిద్దాం
గద్దర్‌ విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : గద్దర్‌ ఆశ యాలను కొనసాగిద్దామని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నా రాయణరెడ్డి అన్నారు. కల్వ కుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గద్దర్‌ విగ్ర హాన్ని ఆగస్టు 10న ఆవిష్క రించనున్నారు. ఇందుకు సం బంధించిన కరపత్రాలను ఆది వారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో విగ్రహా కమిటీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో ఆగస్టు 10న ప్రజా యుద్ధ నౌక గద్ద ర్‌ ఆవిష్కరణ అట్టహాసంగా నిర్వహించాల న్నారు. అనంతరం గద్దర్‌ విగ్రహ దాత ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని విగ్రహ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో గద్దర్‌ విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు ప్రముఖ న్యాయవాది లక్ష్మణశర్మ, టి.శేఖర్‌, సుధాకర్‌, జగన్‌, జంగయ్య, రేణుక, సైదులు, నిరంజన్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:39 PM