kumaram bheem asifabad- కాళోజీ ఆశయాలను కొనసాగిద్దాం
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:00 PM
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తన నవలల ద్వారా తెలియజేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలకు కలెక్టర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తన నవలల ద్వారా తెలియజేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలకు కలెక్టర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షర రూపం దాల్చిన ఒక సిర చుక్క లక్ష మెదళ్లకు కదలిక తీసుకువస్తుందని కాళోజీ చాటి చెప్పారని అన్నారు. కాళోజీ ఆశయ సాధనకు కృషి చేసి జిల్లాను అభివృద్ధి ముందంజలో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్రోల్‌పంపు పాఠశాలలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు వెంకట రాజమయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల నిత్య జీవితంలో వాడే పదాలతో విప్లవాత్మక కవితలు రాసి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహా కవి కాళోజీ అన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల కాగజ్‌నగర్ బాలురు-1లో కాళోజీ నారాయణరావు జి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోమి ప్రతిభ సర్‌సిల్క్ బాయ్స్ ప్రధానోపాధ్యాయులు పర్శ చంద్రశేఖర్, రిసోర్స్ పర్సన్ సుందిళ్ల రమేష్, మైనార్టీ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్ బాలుర--1 ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, సుధాకర్, స్వాతితో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగు ఆవశక్యతపై తెలుగు ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కాగజ్‌నగర్ టౌన్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ కాళోజీ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ముందున్నారన్నారు. కాళోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ దత్తాత్రేయ, లెక్చరర్లు, జనార్ధన్, శారద, వెంకటేశం, రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏపీవో పూర్ణిమా, కార్యదర్శి సాయికృష్ణ, కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి):తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీటీ బీమ్లానాయక్, ఆర్‌ఐ అచ్యుతరావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.