సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:09 PM
సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్ట రేట్ కార్యాలయ భవన సమావేశం మందిరంలో పోషణ మాసం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్ట రేట్ కార్యాలయ భవన సమావేశం మందిరంలో పోషణ మాసం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 16 వరకు జిల్లా లో నిర్వహించనున్న పోషణమాసం కార్యక్రమాన్ని సంబం దిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చే యాలన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి రోజు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహనకల్పించాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ పోషకాహారం లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ గర్బిణీలకు అవసర మైన వైద్య పరీక్షలను సకాలంలో అందించాలన్నారు. మూ త్రశాలలు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటుకు చర్యలు తీసుకోవా లన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, డీ ఆర్‌డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, వైద్య ఆరోగ్య శా ఖ జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్, సీడీపీవోలు విజయ, రజిత, పోషన్ అభియాన్ జిల్లా సమన్వయకర్త సౌజన్య పాల్గొన్నారు.