Share News

మానవునికి సోకే నిశ్శబ్ద అంధత్వాన్ని ఛేదిద్దాం

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:19 PM

మానవునికి సోకే నిశ్శబ్ధ అంధత్వాన్ని ఛేది ద్దామని ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంక టదాస్‌ అన్నారు.

మానవునికి సోకే నిశ్శబ్ద అంధత్వాన్ని ఛేదిద్దాం
ప్రత్యేక కంటి శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంకటదాస్‌

- ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంకటదాస్‌

కందనూలు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మానవునికి సోకే నిశ్శబ్ధ అంధత్వాన్ని ఛేది ద్దామని ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంక టదాస్‌ అన్నారు. ప్రపంచ గ్లకో మా వారోత్సవాలను పురస్క రించుకుని పాత కలెక్టరేట్‌లో గది నెంబరు 102 కంటి కేంద్రం లో బుధవారం ప్రత్యేకకంటి శిబి రాన్ని ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్ట ర్‌ ఎం.వెంకటదాస్‌ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక వారోత్స వాల్లో వచ్చిన ప్రతీ రోగికి కంటి దృష్టిపై అవగా హన పెంచాలని సూచించారు. నీటి కాసుల వ్యాధి అనేది నిశ్వబ్దంగా అంధత్వాన్ని మానవు నికి కలిగిస్తుందని తెలిపారు. పలు కంటి జాగ్ర త్తలు పాటించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన కంటి శిబిరంలో 132మంది రోగు లను పరీక్షలు జరపగా 52మందికి కంటి పొర లు, కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి లయన్‌ రాంరెడ్డి హాస్పిటల్‌, ఏనుగొండకు ప్రత్యేక అం బులెన్స్‌లో పంపించారు. శిబిరంలో నేత్రాధికారి కొట్ర బాలాజీ, వీరమళ్ల, వెంకటస్వామి రోగు లకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ నరసింహ, మలేరియా అధికారి ఆర్‌.శ్రీనివాసులు, లెప్రసీ పారామెడికల్‌ అధికారి సుకుమారెడ్డి, ప్రకాశ్‌, రమేష్‌, ఫార్మాసిస్టు సురేష్‌, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:19 PM