kumaram bheem asifabad- గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:31 PM
మహాత్మ గాంధీ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
ఆసిఫాబాద్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మహాత్మ గాంధీ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. అహింస మార్గం ద్వారా స్వాతంత్య్రం సాధించడంలో యావత్ ప్రపంచానికి స్పూర్తిదాతగా నిలిచారన్నారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సక్షేమాధికారి శివకుమార్, తహసీల్దార్ రియాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ కాంతిలాల్ పాటిల్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్‌ఐలు పెద్దన్న, అంజన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజి చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే స్థానిక విశ్రాంత ఉద్యోగు సంఘ భవన్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జయదేవ్, కార్యదర్శి శివప్రసాద్, రాజేంద్రప్రసాద్, చంద్రమౌళి, అన్వర్ అహ్మద్, అంకయ్య, మురళీధర్‌రావు, పురుషోత్తం కుమార్, సత్యనారాయణ, నర్సయ్య, రాజేశ్వర్ స్వామి, నారాయణ, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విజయభాస్కర్‌రెడ్డి గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎం నరేందర్, ఏజీఎం జి కృష్ణమూర్తి, డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహర, ఎస్‌కె మదీనా భాషదితరులు పాల్గొన్నారు.