Share News

Leopard Cub Captured: కరీంనగర్‌లో పునుగు పిల్లి

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:42 AM

తిరుమల తిరుపతి కొండల్లో, శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు తరచుగా కరీంనగర్‌లో ప్రత్యక్షమవుతున్నాయి....

Leopard Cub Captured: కరీంనగర్‌లో పునుగు పిల్లి

  • బంధించి డీర్‌పార్క్‌కు తరలించిన అటవీశాఖ అధికారులు

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి కొండల్లో, శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు తరచుగా కరీంనగర్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం కరీంనగర్‌ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి ఇంటిలో పునుగుపిల్లిని గుర్తించిన కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది పునుగు పిల్లిని డీర్‌పార్క్‌కు తరలించారు. పునుగుపిల్లి ఆరోగ్యంగా లేదని, డీర్‌పార్క్‌లో వైద్యుల చేత పరీక్షలు చేయించి, ఆరోగ్యం బాగుపడ్డాక అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి నర్సింగరావు తెలిపారు.

Updated Date - Dec 15 , 2025 | 04:42 AM