kumaram bheem asifabad- రిజిస్టర్ పోస్టుకు సెలవు
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:16 PM
సర్ పోస్టు.... మేడమ్ పోస్టు... పల్లెల్లోకైనా.. పట్టణాల్లోనూ ఉత్తరాలు మోసుకోని వచ్చే వారధి పోస్టుమాన్. సైకిల్‌పై వచ్చి బెల్ మోగిస్తూ చేతిలో ఉత్తరాన్ని పెడితే చదవాలనే ఆతృత ఉండేది. సైన్యంలో పహరా కాస్తున్న జవాను.. తల్లిదండ్రులు, భార్యకు లేఖ ద్వారా ఇచ్చిన సందేశం, నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న కబు రందించే ఉత్తరం, మనసులో మాటను చెప్పలేక కవి తలు రాసిన ప్రేమ భావం. సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి అందిం చే ఆహ్వానం, క్యాంటిన్ ఖర్చులు, పుస్తకాలకు డబ్బులు పంపమని నాన్నగారికి విన్నపం, ఇలా సందర్భమేదైనా అన్ని రకాల భావాలను అందించే ఉత ్తరం ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు.
- స్పీడ్ పోస్టులో విలీనం
- పెరిగిన సాంకేతికతే కారణం
వాంకిడి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సర్ పోస్టు.... మేడమ్ పోస్టు... పల్లెల్లోకైనా.. పట్టణాల్లోనూ ఉత్తరాలు మోసుకోని వచ్చే వారధి పోస్టుమాన్. సైకిల్‌పై వచ్చి బెల్ మోగిస్తూ చేతిలో ఉత్తరాన్ని పెడితే చదవాలనే ఆతృత ఉండేది. సైన్యంలో పహరా కాస్తున్న జవాను.. తల్లిదండ్రులు, భార్యకు లేఖ ద్వారా ఇచ్చిన సందేశం, నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న కబు రందించే ఉత్తరం, మనసులో మాటను చెప్పలేక కవి తలు రాసిన ప్రేమ భావం. సెలవులకు పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని పిలుస్తూ కూతురు, అల్లుడికి అందిం చే ఆహ్వానం, క్యాంటిన్ ఖర్చులు, పుస్తకాలకు డబ్బులు పంపమని నాన్నగారికి విన్నపం, ఇలా సందర్భమేదైనా అన్ని రకాల భావాలను అందించే ఉత ్తరం ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు. మారుతున్న కాలంతోపాటు ఉత్తరం కనుమరుగైంది.
- తపాలాసేవల్లో మార్పులు
తపాలా సేవల్లో మార్పులు వచ్చాయి. ఒక నాడు ఉత్తరాల బడ్వాడాకు, మనీ ఆర్డర్లు పంపేందుకు, పొదుపు పథకాలు అందిచేందుకు ప్రధానకేంద్రాలుగా పోస్టాఫిసులు ఉన్నా యి. నేడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరిస్తూ, బీమా పాలసీలు అందిస్తూ బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. ప్రజలు కూడా అందివచ్చిన టెక్నాలజీ, స్మార్ట్‌ఫో న్లకు అలవాటుపడ్డారు. సెల్‌ఫోన్టు విరివిగా వినియోగించ డం వంటి కారణాలతో ఉత్తరాలు కనుమరుగ య్యాయి. పార్సిళ్లు వంటివి పంపాలంటే ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం తపా లా కార్యాలయాల్లో పోస్టుకార్డులు, ఇన్‌లాండ్, బుక్‌పో స్టు లెటర్లు కనిపించడంలేదు.
- బ్రిటిష్ కాలం నాటిది..
పోస్టల్ శాఖలో రిజిస్టర్ పోస్టుది సుదీర్ఘ చరిత్ర. 1854లో బ్రిటిష్ కాలంలో మన దేశంలోకి ప్రవేశపె ట్టిన పోస్టుబాక్సులు ఇకపై కనుమరుగు కానున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు పోస్టుబాక్సులు, ఉత్తరాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకు న్నారు. బంధువులు, స్నేహితులకు రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, అభిమాన రచయితలు, సినీతారలకు రాసిన లెటర్స్‌తో పాటు ఊరు పేరు లేకుండా రాసే ఆకాశరా మన్న ఉత్తరాలు ముందు ఈ పోస్టుబాక్సుల్లో పడెస్తే.. అక్కడి నుంచి చేరాల్సిన చోటుకు చేరేవి. పెరుగుతన్న టెక్నాటజీని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకునే చర్యలో భాగంగా పోస్టుబాక్సులు తొలగించనున్నారు. దేశ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపివేయనున్నట్లు శాఖాధికా రులు వెల్లడిస్తున్నారు. కొంత కాలంగా ఇంటర్నెట్, డిజిటల్ కమ్యూనికేషన్ల వల్ల సాధారణ రిజిస్టర్ పోస్టులు, పోస్టు బాక్సుల ఉపయోగం గణనీయంగా తగ్గిపోయింది. ఇకపై ఈ సేవను స్పీడ్‌పోస్ట్‌లో విలీనం చేయడం ద్వారా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ట్రాకింగ్‌లో కచ్చితత్వాన్ని, డెలివరీ వేగాన్ని ఆపరేషనల్ ఎఫిషి యన్సీని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.