Share News

పథకాల అమలులో దేశంలోనే అగ్రగామి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:36 PM

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్ర గామిగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

పథకాల అమలులో దేశంలోనే అగ్రగామి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్ర గామిగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లను విడతల వారీగా మంజూరు చేస్తా మని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కల్వకుర్తి పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండ, చారకొండలకు చెందిన ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులు 1350 మందికి ఎమ్మెల్యే ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం అందజే శారు. కల్వకుర్తి పట్టణ పరిధిలోని జేపీ నగర్‌ తండాలో రెండు ఇళ్ల, తి మ్మరాసిపల్లి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క ల్వకుర్తి నియోజకవర్గం గతంలో అభివృద్ధికి నోచు కోలేదని, కనీసం ఆసుపత్రి లో మెరుగైన వైద్యం అం దక ఇబ్బందిపడ్డారని ఆవే దన వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో పొల్యూషన్‌ కంట్రో ల్‌ బోర్డు మాజీ సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసిం గ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌ కుమార్‌, కల్వకుర్తి ఆర్డీవో ఎస్‌.శ్రీను, కమి షనర్‌ మహమ్మద్‌ షేక్‌, నాయకులు చిమ్ముల శ్రీకాంత్‌ రెడ్డి, సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌, అశోక్‌ రెడ్డి, భూపతిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పసుల రమాకాంత్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మా నిటరింగ్‌ కమిషన్‌ సభ్యుడు జిల్లెల రాములు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:36 PM