Share News

kumaram bheem asifabad-జనహిత పాదయాత్రకు తరలిన నేతలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:51 PM

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్‌ నియోజక వర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వప్ర సాద్‌రావు ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు.

kumaram bheem asifabad-జనహిత పాదయాత్రకు తరలిన నేతలు
ఆసిఫాబాద్‌ నుంచి పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 3 (ఆంఽధ్రజ్యోతి): కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్‌ నియోజక వర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వప్ర సాద్‌రావు ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రస్‌ అభివృద్ధి కోసం కార్యకర్తలు పాలు పడాలన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో జనహిత పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, చరణ్‌, జమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జనహిత పాదయాత్రలో భాగంగా ఆదివారం ఖానాపూర్‌లో చేపడుతున్న కార్యక్రమానికి జైనూర్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పర్యటిస్తుండడంతో జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల కాంగ్రెస్‌ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముఖాద్‌, సిర్పూర్‌(యు) మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్‌, మాజీ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌, ఆత్రం ప్రకాష్‌, ఆత్రం అనిల్‌కుమార్‌, మాజీ సర్పంచులు కనక ప్రతిభ,మెస్రం భూపతి, జాలింషా, నాయకులు మెస్రం అంబాజీ, దౌలత్‌రావు, హైదర్‌, ఆత్రం లచ్చు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 10:51 PM