అర్పిస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:23 PM
తెలంగాణ మలిదశ ఉద్య మంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్థంతిని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం జిల్లా కేం ద్రంలో ఘనంగా నిర్వహిం చారు.
అమరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మలిదశ ఉద్య మంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్థంతిని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం జిల్లా కేం ద్రంలో ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని అంబే డ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి చిత్ర ప టానికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వబ్రాహ్మణ సం ఘం జిల్లా అధ్యక్షుడు పాండుచారి మాట్లాడు తూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి చూపిన తెగువ, ప్రాణత్యాగం రాష్ట్రం ఏ ర్పాటులో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నా రు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నా యకులు ప్రతాప్‌చారి, జేపీచారి, ప్రసాద్‌చారి, సుగుణచారి, వీరసత్యంచారి, కపిలవాయి గోపీ చారి, శ్రీనుచారి, వేణుచారి, నరేందర్‌చారి, రాజు చారి, విష్ణుచారి పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మలిదశ ఉద్యమకారుడు శ్రీ కాంతాచారి వర్థంతిని పురష్కరించుకొని బుధవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి స్వర్ణకార సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. స్వర్ణకార సంఘం నాయకుడు నాగరాజు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం శంకరమ్మ కుటుంబా నికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, మాధవాచారి, ఉమాశంకర్, విష్ణు మూర్తి, శ్రీనివాసచారి, మురళి, శేఖర్, రమాకాంత్ పాల్గొన్నారు.
ఫ పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) : కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని బుధవారం మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆదెర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వి.సత్యం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ, మండల విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కోలాటం మహేష్‌ఆచార్యు లు, సభ్యులు కరుణాకరాచారి, రాజశేఖర్ ఆచారి, జగదీశ్ ఆచారి, ఫిరంగి, గురుబ్రహ్మ ఆచారి, నరేంద్ర ఆచారి, పెద్దపల్లి, పృథ్వీ ఆచారి, ఓంకారాచారి, గోల్డ్ నరసింహచారి, కృష్ణమోహ నాచారి, పసుపునూరు మహేశ్వర్, జగన్మోహన్ ఆచారి, ప్రజలు పాల్గొన్నారు.