Share News

శాంతిభద్రలు గాడి తప్పాయి : చిరుమర్తి

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:19 AM

నకిరేకల్‌ నియోజకవర్గంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

శాంతిభద్రలు గాడి తప్పాయి : చిరుమర్తి

నల్లగొండ క్రైం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నకిరేకల్‌ నియోజకవర్గంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ను శనివారం కలిశారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాల గురించి వివరించారు. అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ ఐదేళ్లు ప్రశాంతంగా ఉన్న నకిరేకల్‌ నియోజకవర్గంలో కొందరు కావాలని అలజడి సృష్టిస్తున్నారని ఆరోపిం చారు. బీఆర్‌ఎస్‌ నాయకులను టార్గెట్‌ చేస్తూ గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ వారు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తికే మంజూరు చేయడం పట్ల నకిరేకల్‌ మండలంలోని తాటికల్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్త మనోహర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు అతనిపై మాజీ సర్పంచ్‌తో పాటు అతని అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కడపర్తి గ్రామంలో బోర్ల బిక్షమయ్య అనే రైతు భూ వివాదంలో ప్రత్యర్థి ఎమ్మెల్యే గన్‌మెన్‌ కావడంతో ఆ సమస్యను స్థానిక పోలీసులు సంవత్సరం నుంచి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Updated Date - Jul 20 , 2025 | 12:19 AM