Large Cannabis Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:07 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని హైడ్రోఫోనిక్ డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు...
శంషాబాద్ రూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని(హైడ్రోఫోనిక్) డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. డీఆర్‌ఐ అధికారుల వివరాల మేరకు.. బ్యాంకాక్ నుంచి 6ఈ 1068 విమానంలో తమీమ్ అన్సారీ ఇబ్రహీం, షేక్ రేష్మా అనే ఇద్దరు ప్రయాణికులు శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎయిర్‌పోర్టులో ఆ ఇద్దరి బ్యాగులను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. వారి వద్ద 2 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు.