భూమిపై యాజమాన్య హక్కులు సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలి: హైకోర్టు
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:27 AM
కక్షిదారులు సమర్పించిన పత్రాలు వాస్తవమైనవా.. నకిలీవా అనే ప్రాథమిక అంశంపై వివాదం ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):కక్షిదారులు సమర్పించిన పత్రాలు వాస్తవమైనవా.. నకిలీవా అనే ప్రాథమిక అంశంపై వివాదం ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత సివిల్ కోర్టులోనే దావా వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆస్తి హక్కులపై వివాదాలను పరిష్కరించడానికి సరైన వేదిక సంబంధిత సివిల్ కోర్టు మాత్రమే అని సుప్రీంకోర్టు, ఈ హైకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4, షేక్‌పేట్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 396 (రివిజన్ సర్వే 225) దాదాపు 7 ఎకరాల భూమిపై హక్కులు క్లెయిం చేస్తూ శాలినీ సించార్, మహమ్మద్ ఫయాజుద్దీన్ వేర్వేరు రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం పరిశీలించింది. తొలుత సివిల్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది.