Share News

kumaram bheem asifabad-భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:37 PM

అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గురువారం తహసీల్దార్‌లతో వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శా భూములు, దేవాదాయ, వక్ఫ్‌, సీలింగ్‌, లావుని పట్టా భూముల వివరాల నమోదుపై సమీక్షీ సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గురువారం తహసీల్దార్‌లతో వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శా భూములు, దేవాదాయ, వక్ఫ్‌, సీలింగ్‌, లావుని పట్టా భూముల వివరాల నమోదుపై సమీక్షీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల కొరకు సేకరించిన భూములు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు, రహదారులు, రైల్వే లైన్‌ నిర్మాణ పనులలో సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్‌, లావుని పట్టా, దేవాదాయ, వక్ఫ్‌ భూముల వివరాలను 22ఏ నిషేధిత జాబితాలో నమోదు చేయాలని తెలిపారు. ఏ ఒక్క సర్వే నెంబరు తప్పి పోకూడదని, గ్రామాల వారీగా నిషేదిక జాబితాలో ఉన్న భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. సమావేశంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మెరుగైన విద్యా విధానాలు అమలు చేసేందుకు అంతర్జాతీయ ఎక్స్ఫ్‌జర్‌ విజిట్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. అంతర్జాతీయ ఎక్స్ఫ్‌జర్‌ విజిట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి విద్యాధికారి దీపక్‌ తివారి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవితో కలిసి ఇంటర్వ్యూనిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయం అవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌ అవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన స్థలాన్ని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆర్‌ఆండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌ అవరణలో అనువైన ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 10:37 PM