kumaram bheem asifabad- లంబో‘ధరా’..కొలిచేదెలా..
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:36 PM
ముడిసరుకుల ధరలు పెరుగడంతో ఆ ప్రభావం గణనాథుల విగ్రయాల తయారీపై పడింది. గతేడాది తో పోల్సితే 10 నుంచి 15శాతం ధరలు పెరిగాయని చెబుతున్నారు.
- ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన మండపాల నిర్వాహకులు
- అధిక ధరలతో భక్తుల బెంబేలు
- ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ కేంద్రాలుగా విగ్రహాల తయారీ
- జిల్లా వ్యాప్తంగా 12 కోట్లపైనే ఉత్సవాలకు ఖర్చు
- ఈ నెల 27న వినాయక చవితి
ముడిసరుకుల ధరలు పెరుగడంతో ఆ ప్రభావం గణనాథుల విగ్రయాల తయారీపై పడింది. గతేడాది తో పోల్సితే 10 నుంచి 15శాతం ధరలు పెరిగాయని చెబుతున్నారు.
చింతలమానేపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గణనాథుల ఉత్సవాలకు కుమరంభీం ఆసిఫా బాద్ జిల్లాలో భక్తులు సిద్ధమయ్యారు. ముడిసరుకులు, కూలీ రేట్లు, రంగుల ధరల పెరుగు దలతో ఈ సారి కూడా లంబోధరుడి ధరలు భారీగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ కేంద్రంగా తయారైన విగ్రహాలు జిల్లాలోని ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 27న వినాయక చవితి ఉండడంతో విగ్రహాల కొనుగోళ్లపై నిర్వాహకులు దృష్టి సారించారు. విగ్రహాలకు ఇప్పటికే తమకు ఇష్టమైన ఆకృతి, ఎత్తులో ఉన్న విగ్రహాలను కొనుగోళ్లు చేసేం దుకు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తయారు చేస్తున్న కేంద్రాల వద్దకు వెళ్లి విగ్రహాలను ముం దస్తుగానే కొంత నగదును అడ్వాన్సును ఇచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే గణనాథుల విగ్రహాల ధరలతో పాటు రవాణా చార్జీలు నిర్వాహకులకు భారంగా మారుతున్నాయి. ఈ సారి 6 ఫీట్ల విగ్రహానికి 12వేలు, 7ఫీట్ల విగ్రహానికి రూ. 15 వేలు, 10ఫీట్ల విగ్రహానికి రూ. 18 వేల నుంచి 20 వేల వరకు అమ్ముతున్నారు. 14 నుంచి 15 ఫీట్ల విగ్రహాలు రూ. 40వేల నుంచి రూ. 45వేల వరకు ఉండగా విభిన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భారీగా ఉన్న విగ్రహాలకు లక్షల్లో ధరలు పలుకుతున్నాయి.
- పలు రకాల ఆకృతులు..
బొజ్జ గణపయ్యకు ఎన్నెన్నో రూపాలు ఇచ్చి కొలు స్తుంటారు. ఏ దేవుడికి లేనన్ని ఆకృతులను ఏకదంతుడికి అందిస్తాం. ఎంతో సంతోషాన్ని కలిగించే పండగల్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే వినాయక ఉత్పవాల్లో మట్టి విగ్రహాల వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు. ముడిసరుకుల ధరలు పెరుగడంతో ఆ ప్రభావం గణనాథుల విగ్రయాల తయారీపై పడింది. జిల్లా వ్యాప్తంగా 12 కోట్లపైనే ఉత్సవాలకు ఖర్చు చేయనున్నారు. వినాయక చవితి పండగ ఒకసాంప్రదాయమైతే..నిమజ్జనం వయోబే ధం లేకుండా ఒక సంబురంగా ఉంటుంది. నిమజ్జనం చేసే విగ్రహాలు పాస్టర్ ఆప్ ప్యారిస్‌తో పాటు రసాయన రంగుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా హాని కల్గిస్తాయని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరుతో చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వ విభాగాలు, స్వచ్చంధ సంస్థలు ఉచితంగా మట్టి వినాయకులను ప్రజలకు అందిస్తుండడంతో, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే విగ్రహాలకు మట్టితో చేసినవని వాడుతున్నారు. వీటితో పాటు కొందరు మండపాల నిర్వాహకులు భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గుజరాత్, ఛత్తీస్‌గఢ్ నుంచి..
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కౌటాల తదితర ప్రాంతా లకు గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ వంటి రాష్ట్ర్లాల నుంచి కళాకారులను తెప్పించి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వినాయక విగ్రహాలను ఉత్సవాల కోసం ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తుంటారు. దీంతో ఇక్కడ వారికి ఉపాధి లభిస్తుంది. తమ హస్తకళా నైపుణ్యంతో రకరకాల రూపంతో సుందరాకృతులను ఆకర్షణీయంగా తయారు చేస్తు న్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పందిళ్లు, షెడ్లు వేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సామూహికంగా భక్తి భావంతో పూజలు జరుపుతారు. వినాయక చవితికి మూడు నెలల ముందే ఇతర రాష్ట్రాల నుం చి కళాకారులు జిల్లాకు చేరుకొని విగ్రహాలను తయా రు చేస్తున్నారు. ఈ కళాకారులు ప్రతిమలను తయా రు చేయడమే తమ జీవనాధారమని చెబుతున్నారు. దుంప పిండి, పేపర్ పౌడర్, వైట్ ప్లాస్టర్‌తో వినా యక విగ్రహాల తయారీని చేస్తున్నామని చెబుతున్నా రు. మూడు మిశ్రమాలను కలుపుకొని ఈ పిండిని రబ్బరు లాగా తయారు చేసుకొని వాటితోనే వినాయక విగ్రహాల విడిభాగాలు తయారు అవుతాయని కళాకా రులు చెబుతున్నారు. ప్రస్తుతం విగ్రహాల తయారీకి ఉపయోగించే పాస్టర్ ఆఫ్ ప్యారిస్, గమ్, కొబ్బరి పీ చు ధరలు పెరిగి పోయాయని చెబుతున్నారు.
సైజు ఆధారంగా ధర..
- రౌతు అంజన్న, వినాయక మండపం నిర్వాహకుడు
వినాయక విగ్రహాల ధరలు ఫీట్ల సైజు, వాటి విభిన్న ఆకృతులను బట్టి ధరలు ఉన్నాయి. 6 ఫీట్ల వినాయక విగ్రహానికే ధర రూ.12 వేల వరకు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చి వినాయక విగ్రహాన్ని బుక్ చేశాం. ఏటా ఏడాది వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఖర్చులు పెరిగి నప్పటికీ భక్తి భావంతో ప్రతిష్ఠిస్తాం.