kumaram bheem asifabad- ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాల్సిందే
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:09 PM
ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించే దాకా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ముఖ్య సమావేశంలో జిల్లా, మండలాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 14 (ఆంద్రజ్యోతి): ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించే దాకా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ముఖ్య సమావేశంలో జిల్లా, మండలాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 1976లో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా విద్య పరంగా అప్పటి రాజకీయనాయకులు తమ స్వప్రయోజనాల కోసం వెనుకబడిన వారు అనే నెపం తీసుకు వచ్చి కేవలం తాత్కలికంగా డీఎన్‌టీ(డీనోటిఫైడ్ ట్రైబ్)లుగా అవకాశం ఇస్తే అదే అదనుగా చూసి ఎస్టీలుగా చెలమణి అవుతూ రాష్ట్రంలో ఆదివాసీలకు అందించాల్సిన అభివృద్ది ఫలాలు రిజర్వేషన్లు అన్ని లంబాడీలే అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ నాయకులపై లంబాడీ నాయకులు విమర్శలు చేస్తే ఉర్కునేదిలేదన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే దాకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకారం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అక్టోబరు 6న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తామని అన్నారు. అక్టోబరు 15న అన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామని అన్నారు. అక్టోబరు 20న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, అక్టోబరు 30న ఐటీడీఏ కార్యాలయాల వద్ద వినతి పత్రాలను అందజేస్తామని చెప్పారు. నవంబరు 9న వరంగల్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు 9న ఆసిపాబాద్ జిల్లా కేంద్రంలో బారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ నాయకులు కోవ విజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ, గణేశ్, రవిందర్, నర్సింగ్‌రావు, మోతిరాం, ప్రభాకర్, రాజేందర్, బాపురావు, రమేష్, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.