Share News

kumaram bheem asifabad- ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:47 PM

ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వలస వచ్చి స్థిర పడిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌, రాయి సెంటర్‌ సార్మేడిలు గురువారం తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

kumaram bheem asifabad-  ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆదివాసీ నాయకులు

జైనూర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వలస వచ్చి స్థిర పడిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌, రాయి సెంటర్‌ సార్మేడిలు గురువారం తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్‌ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతు సుప్రీం కోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. వాటిని, సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తు తగిన నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాయి సెంటర్‌ సార్మేడిలు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్‌, కార్యదర్శి ఆత్రం అర్జున్‌, మేస్రాం షేకు, దత్తు, ఆత్రం మోతిరాం, ఆత్రం సోమేశ్వర్‌, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): లంబాడీలకు ఎస్టీ ధ్రువ పత్రాలు జారీ చేయకూడదని ఆదివాసీ సంఽఘాల నాయకులు గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుడిమెత సోము, రాజ్‌ గోండ్‌ సేవా సమితి పెందుర్‌ మోతిరాం పలువురు మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చి వారు ఉద్యోగ, విద్యా, రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు. ఆదివాసీల హక్కులను కొల్గగొడుతున్నారని చెప్పారు. ఇది వరకే లంబాడీలకు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 10:47 PM