Share News

kumaram bheem asifabad- లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:50 PM

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ ధర్మ యుద్ధ సభ నిర్వాహణ కోసం ఆదివాసీ సంఘాల నాయ కులు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలు తీర్మానాలు చేశారు. లంబా డాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

kumaram bheem asifabad- లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
బెజ్జూరులో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆదివాసీ నాయకులు

జైనూర్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ ధర్మ యుద్ధ సభ నిర్వాహణ కోసం ఆదివాసీ సంఘాల నాయ కులు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలు తీర్మానాలు చేశారు. లంబా డాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల చట్టాలు, హక్కులను కాల రాస్తూ ధనికులకే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీ డిమాండ్లపై ఈ నెల 23న ఉట్నూరులో నిర్వహించ తలపెట్టిన ఆది వాసీ ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి అన్ని ఆదివాసీ సంఘాల నాయ కులు, పటేళ్ళు, దేవారిలు, మహాజన్‌లు, సార్మేడిలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కనక యాదవ్‌రావ్‌ కోరారు. సమావేశంలో సార్మేడిలు ఆత్రం ఆనంద్‌రావ్‌, జుగునాక దేవరావ్‌, అనక దేవెందర్‌, ఆ త్రం ఆనంద్‌రావ్‌, మేస్రాం నాగోరావ్‌, పపెందుర్‌ ప్రకాష్‌, సెడ్మకీ భగ్వం త్‌రావ్‌, గాడాం మోహన్‌, మడావి క్రిష్ణ, పుండలిక్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఉట్నూర్‌లో ఈ నెల 23న తలపెట్టిన ఆదివాసీ ధర్మ యుద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సకారాం, ఓంప్రకాష్‌, శంకర్‌, బక్కయ్య, రాజారాం, అమృత, సతీష్‌, రమేష్‌, హన్మంతు, రమేష్‌, శ్యాంరావు, మల్లేష్‌, లలయ్య, గంగారాం, రాజారాం, పురుషత్తం, సత్తయ్య, శ్రీహరి, ఏనుక శ్రీహరి, నందారాం, వెంకటేష్‌, వినోద్‌, షణ్ముఖ, వెంకటేష్‌, గణేష్‌, సుదర్శణ్‌ తపాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆదివాసీ ధర్మ యుద్ధం పోస్టర్ల ను ఆవివాసీ సంఘం నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు చిన్నన్న, అశోక్‌, సకారాం, భుజంగరావు, మల్లేష్‌, సర్దాజాఈ, మధునయ్య, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 10:50 PM