మద్యం టెండర్లకు స్పందన కరువు..
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:24 PM
వైన్ షాపు టెండర్లకు నోటిఫికేషన్ విడుదలై 15 రోజులు కా వస్తున్నా ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. టెండర్లు వేసేందుకు వ్యాపారులు ముందుకు రాక పోవడంతో టెండరింగ్ ప్రక్రియ బోసి పోతోంది. ప్రస్తు తం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది.
-గడువు సమీపిస్తున్నా వ్యాపారుల నుంచి స్పందన కరువు
-గతంలో పోల్చితే భారీగా తగ్గిన దరఖాస్తులు
-విస్తృత ప్రచారం కల్పిస్తున్నా కానరాని ఫలితం
-చివరి రెండు రోజులపైనే అబ్కారీశాఖ ఆశలు
మంచిర్యాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వైన్ షాపు టెండర్లకు నోటిఫికేషన్ విడుదలై 15 రోజులు కా వస్తున్నా ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. టెండర్లు వేసేందుకు వ్యాపారులు ముందుకు రాక పోవడంతో టెండరింగ్ ప్రక్రియ బోసి పోతోంది. ప్రస్తు తం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. దీంతో 2025-2027 సంవత్సరా నికి గాను కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం గత నెల 25న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 73 ఏ4 మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించగా మరునాడు నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు.
పెరిగిన దరఖాస్తు రుసుము...
మద్యం షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపా రులు గతంలో కంటే అధికంగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో ఒక్కో షాపునకు దరఖాస్తు చేసేందుకు రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. గత మద్యం పాలసీలో దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు ఉండగా, ఈసారి అదనంగా లక్ష రూపాయలను పెం చింది. జిల్లాలో మద్యం వ్యాపారం లాభసాటిగా ఉండ టం, ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసు కునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో లిక్కర్ వ్యాపారులు దుకాణాల కోసం పోటీపడే అవకాశాలు ఉంటాయనే భావనలో అబ్కారీశాఖ ఉంది. అందుకు భిన్నంగా వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పెంచేందుకు ఎక్సైజ్ అ ధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభు త్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో అబ్కారీశాఖ ఫ్లె క్సీలు ఏర్పాటు చేసి, మద్యం షాపులకు దరఖాస్తు చే సుకోవలసిందిగా ప్రచారం చేపడుతోంది. కాగా దరఖా స్తుదారులకు లక్కీ డ్రా నిరవిజేతల కొత్త దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి డిసెంబరు 1వ తేదీ నుంచి ప్రా రంభమై 2027 నవంబరు 30 వరకు అమలులో ఉండ నుంది. డిసెంబరు ఒకటవ తేదీ నుంచే దుకాణాల్లో మద్యం విక్రయాలు జరిపేందుకు అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వచ్చింది 14 దరఖాస్తులే....
వైన్ షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపారులు గత నెల 26 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు దరఖా స్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగి యగానే, సంబంధిత వ్యాపారుల సమక్షంలో అదే నెల 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల లబ్దిదారు లను ఎంపిక చేస్తారు. మరో పది రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తం గా కేవలం 14 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధి కారులు చెబుతున్నారు. గత మద్యం పాలసీలో గడువు ముగిసే సమయానికి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ సర్కి ళ్ల పరిధిలో మొత్తం 2242 దరఖాస్తులు రాగా, ఈసారి మిగిలిన పది రోజుల్లో వ్యాపారుల నుంచి అదే స్థాయి లో స్పందన వచ్చి, అంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయా...? అన్న సందేహాలు నెలకొన్నాయి.
’కోడ్’ కూయడమే కారణమా...?
మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించ డం, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షె డ్యూల్ విడుదల చేయడం కొంచం అటూ ఇటుగా ఒకే సారి జరిగిపోయాయి. వైన్ షాపుల నోటిఫికేషన్ గత నెల 25న విడుదలకాగా, ఎన్నికల షెడ్యూల్ అదే నెల 29న జారీ అయింది. దీంతో అదే రోజు నుంచి మోడల్ కండక్ట్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ కారణంగా రూ. 50 మించి నగదు వెంట తీసుకెళ్లడం కుదరదు. వైన్ షాపు టెండర్లకు రూ. 3 లక్షల రుసుం చెల్లించాల్సింది. ఈ క్రమంలో అంత మొత్తం ఒకేసారి తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఒకవేళ నగదు పట్టుబడితే రిస్క్‌లో పడతా మన్న భావనతో వ్యాపారులు మద్యం షాపులకు దర ఖాస్తు చేసేందుకు వెనుకంజ వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మద్యం షాపులకు డ్రా ని ర్ణయించిన 23వ తేదీనే మొదటి విడుత ఎన్నికలకు షెడ్యూల్ జారీ అయింది. దీంతో ఆశించిన మేర వ్యా పారుల నుంచి స్పందన లేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికలపై హై కోర్టు స్టే ఇవ్వడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో ఇకమీదట మద్యం షాపుల టెండర్లు ఊపందుకుంటాయనే ప్రచారం జరుగుతోంది.
వైన్‌షాపులకు దరఖాస్తు చేసుకోవాలి...
ఎక్సెజ్ సూపరింటెండెంట్ నందగోపాల్
గత మద్యం పాలసీతో పోల్చితే ఈ సారి దరఖాస్తు ప్రక్రియ సులబంగా ఉండగా, లైసెన్సు ఫీజు చెల్లింపు వాయిదాలు కూడా సులభతరం అయ్యాయి. మరోవైపు ఎవరు ఎన్ని దరఖాస్తులు చేసేందుకైనా ప్రభుత్వం అ నుమతినిచ్చింది. గతంలో ఈ విధానం అమలులో లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. మరో పది రోజులే గడువు ఉన్నందున వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపా రులు ముందుకు రావాలి.