Share News

kumaram bheem asifabad- ‘ఎన్‌ఎఫ్‌భీఎస్‌’పై అవగాహన కరువు

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:09 PM

కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశ పెట్టిన జాతీయ కుటుంబ ప్ర యోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) గు రించి అవగాహన లేక పోవడంతో నిరుపేదలు ఆర్థిక సాయానికి దూరమవు తున్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబా నికి ఒకింత సహాయం అందించి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. పేదలకు ఎంతో మేలు చేస్తున్నందున బాధిత కుటుంబాల వారు ఈ పథ కాన్ని ఉపయోగించుకోవాలి.

kumaram bheem asifabad- ‘ఎన్‌ఎఫ్‌భీఎస్‌’పై అవగాహన కరువు
లోగో

- కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20వేల సాయం

బెజ్జూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశ పెట్టిన జాతీయ కుటుంబ ప్ర యోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) గు రించి అవగాహన లేక పోవడంతో నిరుపేదలు ఆర్థిక సాయానికి దూరమవు తున్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబా నికి ఒకింత సహాయం అందించి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. పేదలకు ఎంతో మేలు చేస్తున్నందున బాధిత కుటుంబాల వారు ఈ పథ కాన్ని ఉపయోగించుకోవాలి. కేంద్రం పేదలను ఆదుకు నేందుకు ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకం అమలవుతు న్నా ప్రజలకు అవగాహన లేకపోవడంతో సహాయం కోసం దరఖాస్తులు పెద్దగా రాలేదు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న..

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని పెద్ద చనిపోతే సంబంధిత ధ్రువ పత్రాలతో గ్రామ, మం డల అధి కారుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.20వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోంది. కుటుంబంలోని వితంతువు, అవివాహిత కుమార్తె, కుమారుడికి ఈ ప్రయోజనం లభిస్తుంది. కుటుంబ పెద్ద 18నుంచి 60ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. సాధారణ, ప్రమాదవశాత్తు మృతి చెందిన రెండేళ్లలో పు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మండల పరిషత్తు కార్యాలయానికి దరఖాస్తుతో పాటు సంబం ధిత ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉన్నతాధి కారుల ఆమోదం తర్వాత సహాయం కోసం ప్రభుత్వానికి సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కానీ పేద కుటుంబాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా మండల, గ్రామస్థాయిలో అనేక కార్యక్ర మాలు చేపడుతున్నా ఏనాడు ఇలాంటి మంచి పథకం ఉందన్న విషయం ప్రజలకు తెలియపర్చడం లేదు. నామమాత్రంగా అర్జీలు వస్తున్నాయంటేనే ప్రజలకు ఈ పథకంపై తెలియకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గ్రామాల్లో సైతం ఈ పథకం ఉందన్న విషయం ప్రజలకు తెలియక దరఖాస్తు చేసుకోవ డానికి ముందుకు రావడం లేదు.

గ్రామసభల్లో వివరిస్తున్నాం..

- ప్రవీణ్‌కుమార్‌, బెజ్జూరు ఎంపీడీవో

పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో జాతీ య కుటుంబ ప్రయోజన పథకం గురించి గ్రామ సభల్లో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ప్రభుత్వం సూచించిన ధ్రువ పత్రాలు తప్పనిసరి. డెత్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఫొటో, రేషన్‌కార్డు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ పత్రాలు, బ్యాంకు ఖాతా జిరాక్సు కాపీలతో మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - Oct 28 , 2025 | 10:09 PM