కార్మిక చట్టాలను కొనసాగించాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:21 AM
కేంద్రం 44 కార్మిక చ ట్టాలను కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోపాల్‌లు పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కేంద్రం 44 కార్మిక చ ట్టాలను కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోపాల్‌లు పేర్కొన్నారు. దేశ వ్యాప్త సమ్మె కు మద్దతుగా బుధవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం కార్మిక చట్టాలను కొనసాగించాలని, నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతోందన్నారు. వెంటనే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, దేవరాజ్, లక్ష్మ ణ్, పౌలు, మల్లేష్, చంద్రశేఖర్, సరస్వతి, రమ, సురేఖ, అరుణ, కుసుమ, ఆశయ్య, రంజిత్, ప్రకాష్, శ్రీనివాస్, పద్మ, కుమారి పాల్గొన్నారు.
ఫకేంద్రం కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపా రు. వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ జరిగితే కార్మికులు ఇ బ్బందులు పడతారన్నారు. కేంద్రం 44 చట్టాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గులాబ్, రాజ్‌కుమార్, రాజేష్, కైసర్, లక్ష్మణ్, ప్రశాంత్, విలాస్, మనోహర్, సాయికుమార్, తేజ, ఆర్టిజన్‌లు, జేఎల్‌ఎంలు పాల్గొన్నారు.