Share News

లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:11 PM

దశాబ్దాలుగా పోరాడి సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ చట్టాల్ని వెంటనే ఉపసం హరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు.

లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలి
సమావేశంలో పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు

- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాలుగా పోరాడి సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ చట్టాల్ని వెంటనే ఉపసం హరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆది వారం జిల్లా కేంద్రలోని సీఐటీయూ కార్యాల యంలో మే 20న దేశ వ్యాప్తంగా కార్మిక సమ్మె కోసం సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేప్రీ ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌ చట్టాలు కార్మికుల శ్రమను కార్పొరేట్‌, పెట్టుబడిదారుల కు దోచిపెట్టేదిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగాలన్నింటికీ ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్ప గిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయన్నారు. మే 20 దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి పర్వతాలు, ఈశ్వర్‌, దశరథం, శంకర్‌నాయక్‌, అశోక్‌, రామయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్‌, నాయకులు సత్యం, శ్రీనివాసులు, పాలపీరు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:11 PM