L&T: ఎల్ అండ్ టీ మెట్రోకు అవార్డు..
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:09 PM
ఎల్&టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) న్యూఢిల్లీలో జరిగిన ET ఇన్‌ఫ్రా రైల్ షో 2025లో 'రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్'ను గెలుచుకుంది.
హైదరాబాద్: ఎల్&టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) న్యూఢిల్లీలో జరిగిన ET ఇన్‌ఫ్రా రైల్ షో 2025లో 'రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్'ను గెలుచుకుంది. ఈ పురస్కారం భారతీయ రైలు, మెట్రో మౌలిక సదుపాయాల రంగంలో భద్రత, సుస్థిరత, సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలు, అర్బన్ కనెక్టివిటీలో L&TMRHL చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారు.
ఈ అవార్డు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికుల భద్రత, సమగ్ర రిస్క్ మేనేజ్‌మెంట్, సాంకేతిక ఆవిష్కరణలపై వారి నిబద్ధతను తెలియజేస్తుంది. L&TMRHL MD, CEO, కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు భవిష్యత్ అర్బన్ మొబిలిటీని తీర్చిదిద్దే బాధ్యతను గుర్తు చేసిందని పేర్కొన్నారు. ఆయన PPPల (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు) సవాళ్లను ప్రస్తావిస్తూ, బలమైన విధాన మద్దతు, రిస్క్-షేరింగ్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.