Share News

kumaram bheem asifabad- కుమరం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 10:37 PM

కుమరం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు అన్నారు. కౌటాల మండలంలోని జనగాం గ్రామంలో కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన భీం ఎందరికో ఆదర్శప్రాయుడని చెప్పారు

kumaram bheem asifabad- కుమరం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి
కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కౌటాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు అన్నారు. కౌటాల మండలంలోని జనగాం గ్రామంలో కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన భీం ఎందరికో ఆదర్శప్రాయుడని చెప్పారు. అలాంటి మహానుభావులను స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. కుమరం భీం విగ్రహాలను మారు మూల ప్రాంతాల్లో కూడా ఆవిష్కరిస్తుండడం సంతోషకరమన్నా రు. భీం ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చా,రు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారావు, గణపతి, మాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి కృషి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు ముందు నుంచి గుండి ప్లైఓవర్‌ వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఈ రహదారి అధ్వాన్నంగా మారడంతో కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆదివారం ఆమె అక్కడికి చేసుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుకు శాశ్వత పనులు చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్షాకాలంలో గుంతలు ఉన్న చోట తాత్కాలిక మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వెంట డీఎల్‌పీవో ఉమర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న, కాలనీవాసులు ఉన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 10:37 PM