Share News

kumaram bheem asifabad- కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:31 PM

గిరిజన తెగల హక్కులు, జల్‌జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన కుమరం భీం, ఎడ్లకొండు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో బుధవారం కుమరం భీం, ఎడ్ల కొండు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు

kumaram bheem asifabad- కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలి
రౌటసంకెపల్లిలో కుమరం భీం, ఎడ్లకొండు విగ్రహాలకు పూల మాల వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన తెగల హక్కులు, జల్‌జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన కుమరం భీం, ఎడ్లకొండు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో బుధవారం కుమరం భీం, ఎడ్ల కొండు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని జెండా పూజ నిర్వహించారు. అనంతరం కుమరం భీం, ఎడ్లకొండు విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన తెగల హక్కులు, జల్‌జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన కుమరం భీం, ఎడ్లకొండు ఆదర్శాలను ప్రస్తుత పాలకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, నాయకులు అర్జుమాస్టర్‌, కిష్టయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, బలరాంనాయక్‌, గుణవంతరావు, కుమరం భీం వారసులు కుమరం వెంకటేష్‌, కుమరం రాము, కుమరం అంబరావు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం జోడేఘాట్‌లో కుమరం భీం జయంతిని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు రాజేశ్వర్‌, మోతిరాం, దుందేరావు, మారు, మారుతి, గంగారాం, లక్ష్మణ్‌, బాగుబాయి, రేణుకా, జంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడి అసువులు బాసిన గిరిజనుల ఆరాధ్య దైవం కుమరం భీం జయంతి సందర్భంగా గ్రంథాలయంలో పలువురు ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అఽధికారి సదానందం, సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో బుధవారం కుమరం భీం చిత్రప టానికి పలువురు నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పుష్పలత, నాయకులు తిరుప తి, సకారాం, శ్రీదేవి, అమృత, లలిత, నీలయ్య పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కుమరం భీం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:31 PM