Share News

KTR Vows to Expose Congress: కాంగ్రెస్‌ ద్రోహాన్ని ఢిల్లీలో ఎండగడతాం

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:26 AM

రాష్ట్ర బీసీలకు కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు....

KTR Vows to Expose Congress: కాంగ్రెస్‌ ద్రోహాన్ని ఢిల్లీలో ఎండగడతాం

  • బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీసీలకు కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను వంచిస్తున్న ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే అమలు చేసినట్లు చెబుతూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఈ అంశం చర్చకు వచ్చేలా చూడాలన్నారు. లేదా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు అని చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు తమ గళమెత్తా లన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నేతలతో సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇందులో బీఆర్‌ఎస్‌ నేతలు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, బండ ప్రకాష్‌, మధుసూదనాచారి, శ్రీనివా్‌సగౌడ్‌, గంగుల కమలాకర్‌, జోగురామన్న, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల నుంచి నిధుల అమలు, ఓబీసీ సంక్షేమశాఖ వరకు అన్ని అంశాల్లో కేంద్రంలోని బీజేపీ ద్రోహం చేస్తోందన్నారు. కాగా బీఆర్‌ఎస్‌ వెన్నంటి ఉన్న కార్పొరేటర్లకు భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీకి చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధినేత కేసీఆర్‌ దీక్ష చేపట్టిన నవంబరు 29వ తేదీని దీక్షాదివస్‌ పేరిట ఘనంగా నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. పార్టీ శ్రేణులు దీక్షాదివ్‌సను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Nov 25 , 2025 | 04:26 AM