KTR Slams Govt: యూరియా కోసం రైతుల అవస్థలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:25 AM
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే..
ముఖ్యమంత్రి, మంత్రులెక్కడ?: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడికి ఎగిరిపోతారా? సమస్య లు ఇక్కడ ఉంటే, సీఎం, మంత్రులు ఢిల్లీ, బిహార్‌లోనా అని మంగళవారం ఎక్స్‌లో నిలదీశారు. రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాల కోసం అంతా ఢిల్లీ, బిహార్‌కు వెళ్లారని మండిపడ్డారు. జాతీయ పార్టీలకు ఓట్లు తప్ప.. రాష్ట్ర ప్రజల పాట్లు పట్టవని, యూరియా సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు.