Share News

KTR Slams Congress MLAs: ఇవిగో ఫొటోలు.. వీళ్లు కాంగ్రె్‌సలో చేరలేదా?

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:11 AM

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు.. తాము ఆ పార్టీలో చేరలేదంటూ బుకాయించడం సిగ్గుచేటు.. ఇవిగో ఫోటోలు..

KTR Slams Congress MLAs: ఇవిగో ఫొటోలు.. వీళ్లు కాంగ్రె్‌సలో చేరలేదా?

  • ‘ఎమ్మెల్యేల చోరీ’పై రాహుల్‌ గాంధీ సిగ్గు పడాలి

  • రేవంత్‌.. మీరు నడిపేది సర్కారా? సర్కస్సా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు.. తాము ఆ పార్టీలో చేరలేదంటూ బుకాయించడం సిగ్గుచేటు.. ఇవిగో ఫోటోలు.. వీరు పార్టీ ఫిరాయించలేదా? రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కన్నా.. ఇది దారుణమైన నేరం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఫొటోలు దిగిన ఫొటోలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసిన ఆయన... వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? ఆ కండువాలు కాంగ్రె్‌సవి కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా, సిగ్గు లేకుండా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో భాగస్వామి అయినందుకు రాహుల్‌గాంధీకి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో ఓటు చోరీ గురించి నీతులు చెప్పే రాహుల్‌గాంధీ.. తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. మీరు సర్కార్‌ నడుపుతున్నారా? సర్కస్‌ నడుపుతున్నారా? అని రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కాగా, మునిసిపల్‌ శాఖలోని విభాగాలు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌లో ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని, అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. తప్పును దిద్దుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి.. ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయని విమర్శించారు. కాగా, రైతుల యూరియా కష్టాలను చూపించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 04:14 AM