KTR Slams CM Revanth Reddy: బీసీలపై రేవంత్‌ది కపట ప్రేమ
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:04 AM
బీసీ సంక్షేమానికి లక్షకోట్ల బడ్జెట్, బీసీసబ్-ప్లాన్, వారికి 42ు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలిచ్చి.. కాలంగడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సమాజంపై ఉన్నది...
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమానికి లక్షకోట్ల బడ్జెట్, బీసీసబ్-ప్లాన్, వారికి 42ు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలిచ్చి.. కాలంగడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సమాజంపై ఉన్నది నిజమైన ప్రేమకాదని, అదంతా కపట ప్రేమ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీసీ సంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివా్‌సగౌడ్ తదితరులు బుధవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఇందులో బీఆర్‌ఎస్ నేతలు మధుసూదనాచారి, తలసాని, వి.శ్రీనివా్‌సగౌడ్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, ఈనెల 18న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు తమ నైతిక మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ పార్టీలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కలిసివస్తే బీసీ రిజర్వేషన్ల సమస్య నిమిషంలో పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.