KTR Questions: ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ఎందుకు స్పందిచడం లేదు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:33 AM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు..
200 రోజులు గడిచినా దర్యాప్తు ఏది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగి 200 రోజులు గడిచినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయలేదని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందించలేదని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్య తలెత్తగానే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపిన కేంద్ర ప్రభుత్వం, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య అపవిత్ర బంధం ఉందని, అందుకే ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని చోటేభాయ్‌ని (రేవంత్), ఢిల్లీలోని బడేభాయ్ (మోదీ) ఎప్పటికప్పుడు కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.