Share News

KTR: ఎంబీబీఎస్‌ విద్యార్థికి కేటీఆర్‌ ఆర్థిక సాయం

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:30 AM

ఓ పేద విద్యార్థి కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకున్నా.. ట్యూషన్‌ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాడని తనకు వచ్చిన ట్వీట్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...

KTR: ఎంబీబీఎస్‌ విద్యార్థికి కేటీఆర్‌ ఆర్థిక సాయం

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఓ పేద విద్యార్థి కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకున్నా.. ట్యూషన్‌ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాడని తనకు వచ్చిన ట్వీట్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించి ఆర్థికసాయం అందించారు. వరంగల్‌లోని పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేశ్‌ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయి, తన అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకున్నాడు. ప్రతిభావంతుడైన పేద విద్యార్థి ఎంబీబీఎస్‌ కలను సాకారం చేేసందుకు తక్షణ సాయంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ద్వారా రూ.1,50,000 చెక్కును కేటీఆర్‌ అందజేశారు. ఆ విద్యార్థి ఎంబీబీఎస్‌ పూర్తయ్యే వరకు అవసరమైన ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Oct 07 , 2025 | 02:30 AM