KTR: కేటీఆర్‌పై 100 కోట్ల పరువు నష్టం దావా
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:18 AM
గ్రూప్ 1పై ప్రభుత్వ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు
ఓయూ పీఎస్‌లో కాంగ్రెస్ నేత చనగాని ఫిర్యాదు
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1పై ప్రభుత్వ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై శనివారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్-1 పోస్టులను రూ.3 కోట్లకు అమ్ముకున్నారని నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్.. 24 గంటల్లో ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.