Share News

KTR : వెంటనే ఫీజు రీయింబర్స్‌ బకాయిలివ్వాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:48 AM

వృత్తి నైపుణ్య కళాశాలలకు చెల్లించాల్సిన రూ.10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌....

KTR : వెంటనే ఫీజు రీయింబర్స్‌ బకాయిలివ్వాలి

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్య కళాశాలలకు చెల్లించాల్సిన రూ.10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గత నెల 17న ఖమ్మం నుంచి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నాయకుడు రాకేశ్‌ దత్త చేపట్టిన మహా పాదయాత్ర శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్‌ దత్త, ఆయన బృంద సభ్యులను కేటీఆర్‌, ఎంపీ వద్దిరాజు తదితరులు ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సమ్మిట్‌ అందాల పోటీలకు ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నదే కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు మాత్రం చెల్లించడం లేదన్నారు. ఎంపీ రవి చంద్ర మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జాప్యం చేయడం శోచనీయమన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 06:49 AM