Share News

KTR Criticizes: రేవంత్‌రెడ్డిని ప్రజలు పట్టించుకోవట్లేదు

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:42 AM

గణేష్‌ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ప్రజలు డిస్‌కనెక్ట్‌...

KTR Criticizes: రేవంత్‌రెడ్డిని ప్రజలు పట్టించుకోవట్లేదు

  • కాంగ్రె్‌సకు ఓటేస్తే మన ఇళ్లు కూలగొట్టే లైసెన్స్‌ ఇచ్చినట్లే

  • మోదీ, రేవంత్‌.. ఒక్కటేనని మైనార్టీలు గుర్తించాలి: కేటీఆర్‌

  • జూబ్లిహిల్స్‌ టికెట్‌ మాగంటి సునీతకేనని పరోక్షంగా వ్యాఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ప్రజలు డిస్‌కనెక్ట్‌ అయ్యారనేందుకు ఇదే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌ కార్యకర్తల సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పొరపాటున కాంగ్రె్‌సకు ఓటేస్తే.. జనాల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్‌ ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద దోచుకున్న సొమ్మును పంచి జూబ్లిహిల్స్‌లో గెలిచేందుకు రేవంత్‌ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. మోదీ, రేవంత్‌.. ఒక్కటేనన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్న ఆయన.. పరోక్షంగా ఆమే పార్టీ అభ్యర్థి అని సంకేతాలిచ్చారు. కాగా, సోషల్‌ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పోస్టులను రీపోస్టు చేసిన శశిధర్‌గౌడ్‌ అలియాస్‌ నల్ల బాలుపై నమోదైన 3 కేసులను హైకోర్టు కొట్టివేయడం శుభ పరిణామమని తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 04:42 AM