Share News

KTR: 9న విజయ్‌ దివ్‌సగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:24 AM

కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహారదీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను .......

KTR: 9న విజయ్‌ దివ్‌సగా నిర్వహించాలి

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహారదీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన డిసెంబర్‌ 9వ తేదీని ‘విజయ్‌ దివ్‌స’గా నిర్వహించాలని ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చారిత్రక సందర్భాన్ని సంబరంగా జరుపుకోవాలన్నారు.


అర్థమైన వాళ్లకు అర్థమైనంత!

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు తన ఎక్స్‌ ఖాతాలో తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది. పోస్ట్‌లో భాగంగా ఆయన తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంప్రదాయ తెలంగాణ పంచెకట్టుతో, మెడలో గులాబీ కండువాతో ఓ పెద్ద కుర్చీలో కూర్చున్నట్లుగా ఏఐ ద్వారా సృష్టించిన ఫొటో పెట్టారు. ఈ ఫొటోకు కేటీఆర్‌ ఐవైకేవైకే(ఇఫ్‌ యూ నో.. యూ నో) అనే క్యాప్షన్‌ రాశారు. అర్థమైన వాళ్లకు అర్థమైనంత అని భావం వచ్చేలా రాశారు.

Updated Date - Dec 08 , 2025 | 04:25 AM