Share News

KTR Blames: మహేశ్‌ ఆత్మహత్యకు రేవంత్‌, సీతక్కదే బాధ్యత

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:28 AM

ములుగు మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు మహేశ్‌ ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ..

KTR Blames: మహేశ్‌ ఆత్మహత్యకు రేవంత్‌, సీతక్కదే బాధ్యత

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ములుగు మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు మహేశ్‌ ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నెలలతరబడి వేతనాలు చెల్లించని కారణంగానే మహేశ్‌ ఆత్మహత్యచేసుకొని చనిపోయారని, ఈ దుస్థితిని తెచ్చినందుకు సీఎం, మంత్రి క్షమాపణలు చెప్పాలని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఫోన్‌లో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్‌.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఎక్ర్స్గేషియాతో పాటు మహేశ్‌ భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. లేదంటే బాధితుని కుటుంబంతోపాటు, జీతాలందని కార్మికులకు న్యాయం జరిగే వరకూ బీఆర్‌ఎస్‌ ఆఽధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావినారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపమైన కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి అని పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 02:28 AM