Share News

KTR Blames Congress: కాంగ్రెస్‌ వల్లే యూరియా సంక్షోభం

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:11 AM

యూరియా సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ నేతలు బ్లాక్‌దందాకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...

KTR Blames Congress: కాంగ్రెస్‌ వల్లే యూరియా సంక్షోభం

  • ఆ పార్టీ నేతలు బ్లాక్‌ దందాకు పాల్పడుతున్నారు : కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): యూరియా సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ నేతలు బ్లాక్‌దందాకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒక లారీ లోడ్‌ యూరియాను మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మాన్‌ ఎత్తుకెళ్లారంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు ఎంత దోచుకున్నారో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం వెంగళరావునగర్‌ డివిజన్‌స్థాయి పార్టీ బూత్‌ కమిటీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారా లు జరుగుతున్నా.. అదుపు చేయలేని దౌర్భాగ్యస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం ఉదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుతో 13లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయని, రీయిం బర్స్‌మెంట్‌కు డబ్బుల్లేవని డిప్యూటీ సీఎం భట్టి చెప్పడం సిగ్గుచేటన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కేసీఆర్‌ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Updated Date - Sep 16 , 2025 | 05:11 AM