BRS working president K T Rama Rao: జూబ్లీహిల్స్‌నుంచే బీఆర్‌ఎస్ జైత్ర యాత్ర
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు...
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు చెక్‌పెట్టాలి.. హైదరాబాద్‌లో కాంగ్రె్‌సకు ఒక్కసీటూ రాలేదు
వాళ్లు దోచుకుంటారనే ప్రజలు ఓట్లు వేయలేదు
బీఆర్‌ఎస్ హయాంలోని అభివృద్ధిని వివరించండి
గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మోసాలకు ఈ ఉప ఎన్నికల్లో చెక్ పెట్టాలన్నారు. తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ఆయన శనివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగలు దోచుకుంటారనే.. గత ఎన్నికల్లో వారికి హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయలేదని, అందుకే హైదరాబాద్‌లో వారికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, పేదల ఆశలన్నీ అడియాశలయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని కేటీఆర్ గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని, ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీేసశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో, హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు ఓటేశారని కేటీఆర్ వివరించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్థులు, రైతులు, మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ‘‘అరచేతిలో స్వర్గం చూపిేస్త ఊళ్లలో కొందరు మోసపోయారు. అందుకే గ్రామాల నుంచి రైతులు, ప్రజలు జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తామని చెబుతున్నారు’’ అని ఆయన అన్నారు. ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారని, ఆడవాళ్లకు ఫ్రీ ఇచ్చి పురుషులకు డబుల్ రేటు పెట్టారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు, దళితులకు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామన్నారని కానీ అమలు మాత్రం శూన్యమని చెప్పారు. రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడతానని ముస్లింలను మోసం చేశారని, కాంగ్రె్‌సకు బుద్థి చెప్పాలంటే చిన్న షాక్ ఇవ్వాల్సిందేనన్నారు. తెలంగాణలోని గరీబోళ్లు, కార్మికులు, రైతులు అందరూ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 11న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయాలని ఆయన కోరారు. ‘‘మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్థిని కాపాడుకుందాం’’ అని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, మోసాలను గుర్తు చేయాలని కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలిేస్త రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.