KTR: మెట్రో నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకొంటోంది ముడుపుల వేధింపులతోనే
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:44 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముడుపుల వేధింపులను తట్టుకోలేకే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ తప్పుకొంటోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్....
కాంగ్రెస్ ఎంపీలను గొర్రెల్లా బీజేపీకి అమ్మేశారు
గ్రూప్-1 ఉద్యోగాలను 3కోట్ల చొప్పున అమ్మేశారు : కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముడుపుల వేధింపులను తట్టుకోలేకే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ తప్పుకొంటోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎల్‌అండ్‌టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారని, ఇలాంటి దుర్మార్గ చర్యలవల్ల ప్రైవేటు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. గతంలో పీసీసీ పీఠాన్ని కొన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్నింటినీ అమ్మేస్తున్నారని.. కాంగ్రెస్ తరఫున గెలిచిన 8 మంది ఎంపీలను గొర్రెలు, మేకల మాదిరిగా బీజేపీకి అమ్మేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందన్నారు. నిజంగా రాష్ట్రం లో అద్భుతపాలన ఉంటే వెంటనే ఉపఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ టికెట్‌తో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ బీ-ఫారమ్‌తో ఎంపీగా పోటీచేసిన దానం నాగేందర్ స్పీకర్‌ను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. త్వరలో వివాదాస్పద ఎంఆర్‌సంస్థ ఆస్తులను అమ్మనున్నారని, ఇందులో రేవంత్ ఎంత కమీషన్ తీసుకున్నా రో బయటపడనుందన్నారు. గతంలో పలుకంపెనీలపై ఉన్నకేసులను అడ్డుపెట్టుకొని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని, అన్ని కంపెనీలనుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే ఆయనకు ఏకైకపని అని ఆరోపించారు. సుజన్‌రెడ్డి, అమిత్‌రెడ్డిలకు వందలకోట్ల కాంట్రాక్టులు కొత్తగాఇచ్చారని ఆరోపించారు. రూ.3 కోట్ల చొప్పున గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో అభ్యర్థులు తనతో చెప్పారని తెలి పారు. కాగా, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఎప్పుడన్నది త్వర లో వెల్లడిస్తామన్నారు. సరైన సమయంలో గులాబీ బాస్ జనంలోకి వస్తారన్నారు. బీఆర్‌ఎస్ నేత రాకే్‌షరెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు.