Share News

KTR Alleges Fake Voter Registrations: అడ్డదారిలో గెలిచేందుకు దొంగ ఓట్ల నమోదు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:04 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని.. అందుకోసం దొంగ ఓట్ల నమోదుకు తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...

KTR Alleges Fake Voter Registrations: అడ్డదారిలో గెలిచేందుకు దొంగ ఓట్ల నమోదు

  • కిందిస్థాయి అధికారుల సహకారంతో అక్రమాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని.. అందుకోసం దొంగ ఓట్ల నమోదుకు తెరలేపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపును ఆపలేదని, జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు తథ్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఓటరు కార్డులు ఉన్నాయని, ఇతర నియోజకవర్గాల్లోనూ ఓట్లున్నాయని ఆరోపించారు. ఈ వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందించామన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023 ఎన్నికలప్పుడు 3.75 లక్షల ఓట్లుండగా.. అందులోని 12వేల డూప్లికేట్‌ ఓట్లను తొలగించినా కూడా ఇప్పుడు 3.98 లక్షలకు పెరగడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, దొంగ ఓట్లపై సంపూర్ణ దర్యాప్తు జరపాలన్నారు. కాగా, కాంగ్రెస్‌ స్థానిక నేత అలీ మస్కతి, టీడీపీ మహిళా నేత షకీలారెడ్డి మంగళవారం బీఆర్‌ఎ్‌సలో చేరారు

Updated Date - Oct 15 , 2025 | 04:04 AM