MP Chamal Kiran: గ్రూప్-1 అభ్యర్థులపై విషం కక్కుతున్న కేటీఆర్
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:14 AM
గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు.. ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు ఇచ్చారంటూ కేటీఆర్ విషం కక్కుతున్నారని, ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని పేర్కొన్నారు...
ఆయనపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్
గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు.. ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు ఇచ్చారంటూ కేటీఆర్ విషం కక్కుతున్నారని, ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రె్‌సపై బురద జల్లడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే కేటీఆర్ అజెండాగా కనిపిస్తుందన్నారు. ఇదే అంశాన్ని పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడితే.. ఏదో మీడియా అటెన్షన్ డిసీజ్‌తో ఉందనుకున్నామని, కానీ అదే అంశాన్ని కేటీఆర్ మాట్లాడడం అర్ధరహితమన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కేటీఆర్ కుట్ర పన్నారని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్‌లో మెట్రోను నిర్వహించలేమంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ చాలా కాలంగా కేంద్రానికి లేఖలు రాస్తోందని, కానీ సీఎం రేవంత్ బెదిరింపుల వల్లే మెట్రో నుంచి ఆ సంస్థ తప్పుకుంటోందంటూ కేటీఆర్ చెత్త వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.