KTR Accuses Congress: బీసీలకు కాంగ్రెస్, బీజేపీ వెన్నుపోటు
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:11 AM
చట్టబద ్ధంగా 42శాతం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్రంలో కాంగ్రెస్.. బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): చట్టబద ్ధంగా 42శాతం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్రంలో కాంగ్రెస్.. బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ.. బీసీలకు వెన్నుపోటు పొడిచాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ రెండు జాతీయ పార్టీలకు బీసీలపట్ల చిత్తశుద్ధి లేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జీవో న్యాయస్థానాల్లో నిలబడదని, కేవలం బీసీలకు మభ్యపెట్టేందుకు తీసుకుచ్చారని బీఆర్‌ఎస్ చెప్పిన మాట అక్షరాలా నిజమయిందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చే సిన కాంగ్రెస్.. కులగణన నుంచి రిజర్వేషన్ల జీవో వరకు చేసిందంతా.. మోసమేనని అన్నారు. తన పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ప్రజా వ్యతిరేకతను చూసి రేవంత్‌రెడ్డి భయంతో వణికిపోతున్నారని, అందుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి కాలయాపన చేస్త్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.