Share News

kumaram bheem asifabad-కోట్నాక భీంరావు ఆశయాల సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:14 PM

గిరిజనుల ఆరాధ్యుడు కోట్నాక భీంరావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌ పార్కులో నిర్వహించారు. వర్ధంతి వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులురాలు ఈశ్వరిబాయి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు. భీంరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

kumaram bheem asifabad-కోట్నాక భీంరావు ఆశయాల సాధనకు పాటుపడాలి
నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ తదితరులు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరాధ్యుడు కోట్నాక భీంరావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌ పార్కులో నిర్వహించారు. వర్ధంతి వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులురాలు ఈశ్వరిబాయి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు. భీంరావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరై భీంరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్‌, అర్జుమాస్టర్‌, యాదవరావు, పోచయ్య, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని పురస్క రించుకుని మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు అజయ్‌కుమార్‌, అశోక్‌, సదాశివ్‌, బ్రహ్మయ్య, మారుతి తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలం కేంద్రంలోని గాంధీచౌక్‌లో గల ఆదివాసీ నాయకుడు, మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహానికి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావుతోపాటు పలువురు పూలమాలలు వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌ కేంద్రే శివాజీ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు,మాజీ సర్పంచులు ఆత్రం రాజేశ్వర్‌, ఆర్క నాగోరావు, ఆత్రం ఓంప్రకాష్‌, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, మాజీ ఎంపీటీసీ ఆత్రం వెంకట్‌రావు, కుడ్మేత యశ్వంత్‌రావు, గ్రామ పెద్దలు ఆత్రం ఆనంద్‌రావు, దుర్వా మోతిరాం, గేడం యశ్వంత్‌రావు, ఆత్రం నాగోరావు, సిడం సుభాష్‌, మెస్రం శ్రీరాం, గజానంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:14 PM