Kodandaram: ప్రజాస్వామిక తెలంగాణ నిర్మిద్దాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:17 AM
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా....
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బుధవారం టీజేఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజలు సాగించిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే నిజాం పాలన అంతమైందని, భారతదేశంలో హైదరాబాద్ విలీనమైందని గుర్తుచేశారు. కాగా, ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దానికి ముందు స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.