Kishan Reddy: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దుష్ప్రచారం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:20 AM
రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెర తీశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు...
అసలు రాహుల్ నాయకుడెలా అవుతారు?: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెర తీశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దాదాపు 100 ఎన్నికల వైఫల్యాల తర్వాత కూడా రాహుల్ నాయకుడెలా అవుతారని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ ఆరోపణలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ‘ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రశ్నలకు బీజేపీ సూటిగా సమాధానం చెప్తుంటే ఆ పార్టీ భయపడి పారిపోయింది. రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెరతీశారు. ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైంది. దాదాపు 100 ఎన్నికల వైఫల్యాల తర్వాత కూడా రాహుల్ నాయకుడెలా అవుతారు..? కాంగ్రెస్ శ్రేణులు ఇవన్నీ ఆలోచించకుండా బిజీగా ఉంచేందుకు, నాయకుడిగా తన వైఫల్యాలను ప్రశ్నించే వారు లేకుండా చేసుకోవడానికే రాహుల్ అసత్య ఆరోపణలు, ఆందోళనలు చేస్తున్నారు. రామ్‌లీలా మైదానంలో మాట్లాడిన ఒక్కో నేత రామాయణంలో విలన్‌కు ఉన్న ఒక్కో తలను తలపించేలా ప్రవర్తించారు’ అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.