Share News

Union Minister Kishan Reddy: మజ్లిస్‌ పార్టీ ఓ చీడపురుగు

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:57 AM

మజ్లిస్‌ పార్టీ తెలంగాణకు, దేశానికి పట్టిన చీడపురుగు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న...

Union Minister Kishan Reddy: మజ్లిస్‌ పార్టీ ఓ చీడపురుగు

  • జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్థిని కాంగ్రె్‌సకు అద్దెకిచ్చింది.. ఎవరి ఒత్తిళ్లు, సూట్‌కేసులకు తలొగ్గింది?

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • అక్రమ కబేళాలపై చర్యల్లేవని విమర్శ

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ పార్టీ తెలంగాణకు, దేశానికి పట్టిన చీడపురుగు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న ఆ పార్టీ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతోందని, హైదరాబాద్‌లో రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతోందని ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదు? ఎవరి ఒత్తిళ్లతో, ఎవరి సూట్‌కేసులకు తలొగ్గి మీ అభ్యర్థిని కాంగ్రె్‌సకు అద్దెకిచ్చారు’ అని మజ్లి్‌సను ప్రశ్నించారు. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు మజ్లి్‌సకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కనుమరుగైపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఫాంహౌ్‌సకే పరిమితమైందని, ఆ విషయం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయిందన్నారు.

అక్రమ కబేళాలపై చర్యలేవీ?

తెలంగాణ ప్రభుత్వం గోరక్షణ చట్టాలను అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో అక్రమ కబేళాలు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో న్యూ బోయిగూడ, గోల్నాక ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. వాటిని మూసివేయించాలి. తెలంగాణలోని 39 అక్రమ కబేళాలపై నేను గతంలో సీఎం, సీఎ్‌సలకు లేఖలు రాశా. ఇప్పటివరకు వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి’ అని కోరారు. గోవుల అక్రమ రవాణా మాఫియాకు మజ్లిస్‌ అండగా ఉందని ఆరోపించారు. అక్రమ కబేళాలు నడుపుతున్న ఇబ్రహీం ఖురేషీపై ఛత్తీ్‌సగఢ్‌లో కూడా కేసులు నమోదయ్యాయన్నారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో అతనికి సన్నిహిత సంబంధాలున్నట్లు మజ్లిస్‌ మద్దతుదారులే చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా అక్రమ కబేళాల్లో భాగస్వాములేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - Oct 31 , 2025 | 02:57 AM