Share News

Union Minister Kishan Reddy: సన్నబియ్యం పథకాన్ని రద్దు చేసే దమ్ముందా?

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:47 AM

దమ్ముంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ చేశారు. కాంగ్రె్‌సకు ఓటు వేయకపో....

Union Minister Kishan Reddy: సన్నబియ్యం పథకాన్ని రద్దు చేసే దమ్ముందా?

  • సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌.. కాంగ్రె్‌సకు ఓటేయకపోతే బెదిరిస్తారా? అని ఆగ్రహం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దమ్ముంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ చేశారు. కాంగ్రె్‌సకు ఓటు వేయకపోతే సన్న బియ్యం ఇవ్వడం మానేస్తామంటూ సీఎం హోదాలో రేవంత్‌ బెదిరింపులకు దిగడం ఎంత వరకు సబబు? అని మండిపడ్డారు. ఈ బెదిరింపులు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే నిరాశతోనా? లేదంటే ఇది కాంగ్రెస్‌ మార్కు రాజకీయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నిధులతో ఏమైనా బియ్యం ఇస్తున్నారా? అని నిలదీశారు. సన్నబియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని, కిలోకు రూ.42 చొప్పున కేంద్రం చెల్లిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.15మాత్రమే ఇస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమస్యలను, ప్రజల ఇబ్బందులను పరిష్కరించగల ఏకైక పార్టీ బీజేపీయేనని, ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి దీపక్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో, యూసు్‌ఫగూడలోని కృష్ణకాంత్‌ పార్క్‌లో ఉదయపు నడకకు వచ్చి న ప్రజలతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తోందని, సీఎం రేవంత్‌ రెడ్డి అబద్థాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడికి స్థలం ఇవ్వడానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం.. ఖబరస్థాన్‌ కోసం మాత్రం ఎకరాల కొద్దీ భూములను ధారాదత్తం చేసిందని ఆయన ఆరోపించారు.

ఓటమి భయంలో కాంగ్రెస్‌: రాంచందర్‌రావు

ఉప ఎన్నికలో కాంగ్రె్‌సను ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే సీఎం రేవంత్‌ ఎన్నికల ముందు ఓ మైనారిటీని మంత్రిని చేసి గంపగుత్తగా ఓ వర్గం ఓట్ల కోసం ఆరాట పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దుయ్యబట్టారు. బెదిరించి ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్‌ చూస్తుండ గా.. డబ్బులు వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ పరిధిలో బీజేపీ ఆదివారం మహా పాదయాత్ర నిర్వహించింది. శ్రీకష్ణాగర్‌-ఏ బ్లాక్‌లో ఎంపీ రఘునందన్‌నావు, బోరబండలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, శ్రీనగర్‌లో కాలనీ పార్క్‌లో మల్కా కొమరయ్య పాదయాత్ర చేశారు. రహ్మత్‌నగర్‌లో పాదయాత్రను రాంచందర్‌రావు ప్రారంభిస్తూ మాట్లాడారు. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వనపర్తి జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీలో చేరారు.

Updated Date - Nov 03 , 2025 | 03:47 AM