Union Minister Kishan Reddy: మార్వాడీలకు అండగా ఉంటాం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:44 AM
హైదరాబాద్‌లో కొంతమంది పనికట్టుకుని మార్వాడీ గోబ్యాక్ అంటూ గొడవలు చేయడం మంచి పద్ధతి కాదని, మార్వాడీలకు బీజేపీ ఎప్పుడూ అండగా...
గవర్నర్‌తో కలిసి గోశాల, వెటర్నరీ ఆస్పత్రి ప్రారంభం
తిరుమలగిరి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కొంతమంది పనికట్టుకుని మార్వాడీ గోబ్యాక్ అంటూ గొడవలు చేయడం మంచి పద్ధతి కాదని, మార్వాడీలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్ బోర్డు స్థలంలో గురు గౌతమ్‌ముని జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని శనివారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. జైన్ సామాజికవర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. జైనులందరూ సనాతన ధర్మాన్ని, అహింసను పాటిస్తూ సంఘసేవ చేస్తున్నారని, భారతదేశంలో 24 శాతం మంది వ్యాపారులు జైన్ కమ్యూనిటీకి చెందిన వారేనని తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.