Union Minister Kishan Reddy: కాంగ్రెస్ డబ్బులిచ్చి గెలిచింది
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:31 AM
జూబ్లీహిల్స్‌లో ఏనాడూ తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గానీ, కార్పొరేటర్‌గా గానీ గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు....
ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటాం: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో ఏనాడూ తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గానీ, కార్పొరేటర్‌గా గానీ గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక స్థానం తమ పార్టీ ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి రావడంతో తప్పనిసరిగా ఓ రాజకీయపార్టీగా ఎన్నికలో పాల్గొన్నామని చెప్పారు. భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో తన శాఖలకు సంబంధించిన పెవిలియన్‌లను కిషన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలను సమీక్షించుకుంటామన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందుకు రేవంత్‌కు జనాలు ఓటేశారా? కాదు.. డబ్బులిచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కోట్లాది రూపాయలను పంచాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈవీఎంలు బిహార్‌లో పనిచేయలేదా? జూబ్లీహిల్స్‌లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా? అనే ప్రశ్నకు రాహుల్‌గాంధీ సమాధానమివ్వాలన్నారు. బిహార్ ఫలితాలు ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.